KRNL: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై నాయకత్వంతో మాట్లాడినట్లు పేర్కొన్నారు.