NTR: నందిగామ కాకాని నగర్ వారి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం పొందిన 58 మంది లబ్ధిదారులకు రూ.33.54 లక్షలు విలువైన చెక్కులను అందజేశారు. రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక సవాళ్ల మధ్య కూడా కూటమి పేదలు, బడుగు, బలహీన, సామాన్య వర్గాల పట్ల బాధ్యతను విస్మరించకుండా, వారికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు.