VKB: వికారాబాద్ మండలం జైలుపల్లిలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్, మెటీరియల్ గోడౌన్ను రేపు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించనున్నారని విద్యుత్ శాఖ ఎస్ఈ (SE) రవి ప్రసాద్ తెలిపారు. దాదాపు రూ. 6 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టారన్నారు. ఈ సబ్ స్టేషన్ అందుబాటులోకి వస్తే స్థానిక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు.