MDCL: ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫీర్జాదిగూడ, పర్వతాపూర్ రోడ్డులో గంజాయి అమ్మకాలు జరుపుతున్న వ్యక్తిని ఎస్టీఎఫ్ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడు కుమ్మరి గోపి వద్ద 1.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మున్నా అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు.