• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘నేల సారాన్ని కాపాడాలి’

JGL: కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో నిర్వహించిన ‘కేత్ బచావో అభియాన్’ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగమణి రైతులకు అవగాహన కల్పించారు. వరి కోత అనంతరం కొయ్యకళ్లకు నిప్పు పెట్టవద్దని సూచించారు. అలా చేస్తే నేల సారం తగ్గడంతో పాటు అగ్నిప్రమాదాల ప్రమాదం ఉంటుందన్నారు. జీవో-27 నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తారని హెచ్చరించారు.

June 3, 2026 / 08:45 PM IST

నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం: SP

ADB: నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం రాత్రి ఆదిలాబాద్‌లోని ఇందిరమ్మ కాలనీలో స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి, ఉద్యోగ మోసాలు, అరైవ్-అలైవ్, సైబర్ క్రైమ్, డ్రగ్ అండ్ డ్రైవ్‌పై ప్రజలకు అవగాహన కల్పించినట్లు SP పేర్కొన్నారు.

June 3, 2026 / 08:45 PM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NRML : దస్తురాబాద్ మండలంలో 20 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రారంభించారు. టెంకాయ కొట్టి, రిబ్బన్ కట్ చేశారు. సబ్ సెంటర్‌లోని ల్యాబ్ ,పేషంట్స్ గదిని పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని డాక్టర్, సిబ్బందికి సూచించారు. ప్రజా ప్రభుత్వంలో ఆరోగ్య శాఖకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు.

June 3, 2026 / 08:45 PM IST

‘గ్రామ వార్డు సభలను విజయవంతంగా నిర్వహించాలి’

SRCL: గ్రామ వార్డు సభలను విజయవంతంగా నిర్వహించాలని సిరిసిల్ల కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మార్వోలు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు మండల వ్యవసాయ అధికారులు ఎంపీఓలతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఘన వ్యర్థాల నిర్వహణపై స్పష్టంగా వివరించాలన్నారు.

June 3, 2026 / 08:44 PM IST

ఎంజేపీ గురుకులాల్లో సీట్ల భర్తీ ప్రక్రియ వేగవంతం

RR: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల రెండో దశ ఎంపిక జాబితా విడుదలైంది. ఫస్ట్ లిస్ట్‌లో ఎంపికైన విద్యార్థులు ఈనెల 4వ తేదీలోగా సంబంధిత గురుకులాల్లో రిపోర్ట్ చేయాలని ఎంజేపీ ఇన్‌ఛార్జ్ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు తెలిపారు. వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.

June 3, 2026 / 08:41 PM IST

డీలర్లకు జిల్లా వ్యవసాయ అధికారి సూచనలు

SRD: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ అన్నారు. ఖేడ్ మండలం జుక్కల్ రైతు వేదికలో నేడు ఎరువుల డీలర్లకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న వానకాలం సీజన్లో వర్షపాతం తక్కువగా ఉంటుందని అందుకు అనుగుణంగా తక్కువ నీటితో స్వల్పకాలిక రకాల పంటల విత్తనాలను అందుబాటులో ఉంచి రైతులకు అమ్మాలన్నారు.

June 3, 2026 / 08:41 PM IST

‘రాష్ట్రంలో ప్రత్యామ్నాయం TRS పార్టీ’

MHBD: రాష్ట్రంలో ప్రత్యామ్నాయం TRS పార్టీనే అని మహబూబాబాద్ ఇంఛార్జ్ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. తెలంగాణ రక్షణ సేన మహబూబాబాద్ జిల్లా ముఖ్య నేతల సమావేశాన్ని నేడు నిర్వహించారు. శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. TRS పార్టీ పాంచజన్యం విధానాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. అనంతరం పలువురు యువకులు TRS పార్టీలో చేరారు.

June 3, 2026 / 08:39 PM IST

‘ఇండ్లకు, స్థలాలకు రిజిస్ట్రేషన్లు అయ్యేలా చూడాలి’

MNCL: బెల్లంపల్లిలోని ఇండ్లకు, స్థలాలకు రిజిస్ట్రేషన్లు అయ్యేలా చూడాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ దావా స్వాతి, కౌన్సిలర్లు కోరారు. బుధవారం అదనపు కలెక్టర్ చంద్రయ్యకు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని ఇండ్లకు రిజిస్ట్రేషన్లు జరగక అత్యవసర పరిస్థితులలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంటిని, స్థలాన్ని తనకా పెట్టాలన్న, విక్రయించాలన్నా పనులు జరగడంలేదని అన్నారు.

June 3, 2026 / 08:37 PM IST

‘బడిబాట కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలి’

NRPT: ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై ఆమె నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ప్రియాంక పాల్గొన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

June 3, 2026 / 08:37 PM IST

ఎమ్మెల్యే సత్యంపై రూపొందించిన సీడీ ఆవిష్కరణ

SRCL: ఈ నెల 5న చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం జన్మదినం సందర్భంగా బోయినపల్లి మండల యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు నాగుల వంశీ గౌడ్ ఎమ్మెల్యేపై ప్రత్యేక పాటను రూపొందించారు. ఈ సందర్భంగా రూపొందించిన గేయాల సీడీని బుధవారం కరీంనగర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో మేడిపల్లి సత్యం చేతుల మీదుగా అవిష్కరింపజేశారు.

June 3, 2026 / 08:35 PM IST

జూన్ 7 లోపు రిపోర్ట్ చేయాలి: ప్రిన్సిపల్

SRPT: మునగాల మండలం నెమలిపురి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువు విధించారు. టీజీఎస్ఆర్‌డబ్ల్యూఆర్ జేసీ సెట్ ద్వారా సీటు పొందిన అభ్యర్థులు జూన్ 7వ తేదీ లోపు, కళాశాలలో తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని ప్రిన్సిపల్ శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు.

June 3, 2026 / 08:35 PM IST

ఛైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన MLA

HNK: జిల్లా మడికొండ మెట్టుగుట్ట ఆలయ ఛైర్మన్ పైడిపాల రఘుచందర్ తల్లి పైడిపాల లక్ష్మీ దశదిన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై లక్ష్మీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

June 3, 2026 / 08:35 PM IST

కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NRML: కడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో MLA మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి అధిష్టానం గుర్తిస్తుందని, సమయం వచ్చినప్పుడు పదవులు తప్పకుండా వరిస్తాయన్నారు.

June 3, 2026 / 08:33 PM IST

తగ్గని వేసవి సెగలు.. అల్లాడుతున్న ప్రజలు

NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వేసవి సెగలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 43 డిగ్రీలు దాటడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో, మధ్యాహ్నం అయ్యే సరికి రోడ్లన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తూ నిర్జీవంగా మారుతున్నాయి.

June 3, 2026 / 08:32 PM IST

‘మత్తు పదార్థాల నిరోధానికి సమిష్టిగా కృషి చేయాలి’

NZB: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అ. కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను సూచించారు. నిజామాబాద్ IDOCలో బుధవారం ఆయన అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. యువత మత్తు బారిన పడకుండా చూసేందుకు విద్యాసంస్థల్లో ప్రత్యేక నిఘా, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

June 3, 2026 / 08:32 PM IST