• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నా.. యువ రైతు

BHPL: టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు సోమిడి వినయ్ కుమార్ కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గతంలో పత్తి పంటకు గిట్టుబాటు ధర రాక నష్టపోయిన ఆయన, ఈసారి మొక్కజొన్న సాగు చేశాడు. అయితే గ్రామం చుట్టుపక్కల అడవుల నుంచి వచ్చే కోతులు మొక్కజొన్న మొక్కలను పీకి, పంటను దెబ్బతీస్తున్నాయని ఆయన వాపోయాడు.

January 11, 2026 / 06:14 AM IST

ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి నేటి పర్యటన వివరాలు

MBNR: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్‌లో పర్యటించనున్నారు. ముందుగా ఉదయం 11 గంటలకు పద్మావతి కాలనీలో వడ్డెర ఓబన్న జయంతి వేడుకలలో పాల్గొంటారు. 11.30 గంటలకు డీసీసీ కార్యాలయం సమావేశంలో పాల్గొంటారు. ఒంటిగంటకు టీచర్స్ కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరానికి హాజరవుతారు. అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు.

January 11, 2026 / 06:13 AM IST

ఈనెల 15 నుంచి 22 వరకు సింగోటం బ్రహోత్సవాలు

NGKL: కొల్లాపూర్ మండలంలోని నరసింహస్వామి దేవాలయ బ్రహోత్సవాలు ఈనెల 15 నుంచి 22 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక్కడ స్వయంభు లింగ రూపంలో విగ్రహం ఉండటంతో లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రంగా పేరు పొందింది. రెండో యాదాద్రిగా పిలవబడుతున్న ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో జటప్రోలు సంస్థాన రాజు భూపాలుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

January 11, 2026 / 06:11 AM IST

పండగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు: ఎస్పీ

NRPT: సంక్రాంతి పండగకు ఊర్లకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ శనివారం ప్రకటనలో అన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఫోన్ నంబర్ చిరునామా పోలీసులకు ఇవ్వాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం అని చెప్పారు. ఇళ్ల ముందు వాహనాలకు హ్యాండిల్ లాక్ వేయాలని అన్నారు.

January 11, 2026 / 06:08 AM IST

మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్.. కేసునమోదు

KMR: నిజాంసాగర్ మండలం మార్పల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులు ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా NH-161పై శనివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. అనుమతి పత్రాలు లేకపోవడంతో మూడు ట్రాక్టర్లు, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి, అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై శివకుమార్ హెచ్చరించారు.

January 11, 2026 / 06:06 AM IST

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు మృతి.!

SRPT: మునగాల మండలం నేలమర్రి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రామాంజనేయులు అనే యువకుడు శనివారం ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

January 11, 2026 / 06:05 AM IST

పురుగుమందు తాగి మ‌హిళా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.!

NLG: మ‌హిళా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్న సంఘ‌ట‌న బంటువారిగూడెంలో చోటు చేసుకుంది. నిడ‌మ‌నూర్ మండ‌లం బంటువారి గూడెం గ్రామానికి చెందిన మెరుగు సోమమ్మ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది యాదగిరి ప్రాథమిక చికిత్స చేసి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

January 11, 2026 / 06:04 AM IST

‘అమ్మాయిలు చదువుతోనే ఉన్నత స్థానాలు అధిరోహిస్తారు’

BHNG: అమ్మాయిలు చదువులో ముందంజలో ఉండడంతోనే ఉన్నత స్థానాలు అధిరోహిస్తారని ఆలేరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు నోముల భారతమ్మ అన్నారు. ఆలేరు ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణ కేంద్రంలోని వీ.ఆర్.జూనియర్ కళాశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ఉపాధ్యాయురాలు వడ్డెమాను రాణిలతో కలిసి పాల్గొన్నారు.

January 11, 2026 / 06:03 AM IST

నేడు మేడారంకు వెళ్లనున్న డిప్యూటీ సీఎం భట్టి

KMM: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంత్రి వర్గ సహచరులతో కలిసి ఆదివారం మేడారం వెళ్తున్నారు. అక్కడ జరుగుతున్న జాతర ఏర్పాట్ల పనులను పరిశీలించి, లక్షల సంఖ్యలలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టేలా అధికారులకు పలు సూచనలు జారీ చేయనున్నట్లు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

January 11, 2026 / 06:01 AM IST

నేడు NZBకు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాక

NZB: TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ నేడు నిజామాబాద్ వస్తున్నారు. ఉదయం 8 గంటలకు HYD నార్సింగి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.30కు NZB చేరుకుంటారు. 12 గంటలకు స్థానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 3 గంటలకు R&B గెస్ట్ హౌస్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు.

January 11, 2026 / 06:01 AM IST

ముగ్గుతో రహదారి భద్రతపై అవగాహన

KNR: సైదాపూర్ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సైదాపూర్ మండల కేంద్రంలో సర్పంచ్లు, ఉపసర్పంచ్ల ఆధ్వర్యంలో వినూత్నంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ముగ్గుల రూపంలో రహదారి నిబంధనలను ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ రూరల్ సీఐ హాజరై, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.

January 11, 2026 / 05:57 AM IST

ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ: ఎస్పీ

NRML: సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని చాలా మంది ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్తుంటారని.. ఈ అవకాశాన్ని దొంగలు ఆసరాగా చేసుకునే ప్రమాదం ఉందని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ఊరికి వెళ్లే ముందు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ జరుగుతుందన్నారు.

January 11, 2026 / 05:56 AM IST

ధాన్యం కొనుగోలులో అక్రమాలు.. ఆరుగురిపై కేసు నమోదు

MNCL: జైపూర్ మండలంలోని కిష్టాపూర్ DCMS వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తప్పుడు లెక్కలు చూపి ప్రభుత్వం నుంచి రూ. 38 లక్షలు దుర్వినియోగానికి పాల్పడిన నిర్వాహకుడు రమేశ్‌తో పాటు ఆరుగురిపై కేసు నమోదైంది. జిల్లా సివిల్ సప్లై మేనేజర్ శ్రీలేఖ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ధాన్యం కొనుగోలు అక్రమాలపై సీఐ నవీన్ కుమార్ విచారణ చేపడుతున్నారు.

January 11, 2026 / 05:55 AM IST

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయకపోతే పథకాలు రావు

SRCL: తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల రైతు వేదిక క్లస్టర్ రైతులు వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ఏఈవో గౌతమి తెలిపారు. రిజిస్ట్రేషన్ మెసేజ్ వచ్చిన వారు నేరుగా రైతు వేదికకు రావాలని లేదా 9281096889 నంబర్‌కు కాల్ చేసి మీ ఆధార్, ఫోన్ నంబర్ కు వచ్చే 3 OTPలు చెప్పి నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే పథకాలు రావన్నారు.

January 11, 2026 / 05:52 AM IST

నేడు జిల్లాలో మంత్రుల పర్యటన

PDPL: రామగుండంలో మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ ఇవాళ పర్యటిస్తారని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఈ సందర్భంగా వారు వివిధ డివిజన్లలో రూ. 80.52 కోట్ల అభివృద్ధి పనులు, UIDF నిధులతో చేపట్టనున్న 88.90 కోట్ల విలువైన నీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణ పనులు, R&B ఆధ్వర్యంలో రూ. 6.5 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు.

January 11, 2026 / 05:41 AM IST