• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నారీ శక్తి సత్వర స్పందన.. ప్రజలకు అవగాహన

NRML: నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహిస్తున్న “నారీ శక్తి” కార్యక్రమంలో భాగంగా మహిళా పోలీస్ సిబ్బంది డయల్-100 కాల్స్‌కు తక్షణ స్పందన అందించి ప్రజల సమస్యలను పరిష్కరించారు. అలాగే గ్రామాల్లో సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.

June 3, 2026 / 08:00 PM IST

సీఎం పర్యటనకు పటిష్ట పోలీస్ భద్రత: ఎస్పీ

NRPT: మక్తల్ పట్టణంలో గురువారం సీఎం రేవంత రెడ్డి పర్యటన నేపథ్యంలో 600 మంది పోలీసులతో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వినీత్ తెలిపారు. వివిధ జిల్లాల నుంచి బందోబస్తు కొరకు వచ్చిన పోలీసులతో మక్తల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.

June 3, 2026 / 08:00 PM IST

వీడియో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడిగా సలీం

NLG: నల్లగొండ జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) వీడియో జర్నలిస్టుల విభాగం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా మహాసభల్లో జిల్లా అధ్యక్షుడిగా ఎస్.కె. సలీం, ఉపాధ్యక్షుడిగా తిరుమల శంకర్ ఎన్నికయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి నూతన కార్యవర్గ సభ్యుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తూ, ఏకగ్రీవ నియామకాన్ని వెల్లడించారు.

June 3, 2026 / 08:00 PM IST

మండలంలో అకాల వర్షం

KMR మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో అకాల వర్షం కురిసింది. దీంతో రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకాల వర్షంతో పలు గ్రామాల్లో రోడ్లు జలమయంగా మారాయి. రోడ్లపై ఆరబెట్టిన వారి ధాన్యం తడిసిపోయిందని సకాలంలో కాంటలు కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. వరి ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు.

June 3, 2026 / 08:00 PM IST

పుష్కరాలకు అవసరమైన నిధులు సమకూర్చుతాం: మంత్రి

JGL: రాబోయే గోదావరి పుష్కరాలకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన నిధులు సమకూర్చుతామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి గోదావరి పుష్కరాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కరాలకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

June 3, 2026 / 07:50 PM IST

28 మహిళా సంఘాలకు ఒక్కో బస్సు

SRD: జిల్లాలో మహిళా సంఘాల సభ్యులకు RTC బస్సులను అద్దెకు ఇప్పించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 28 మండలాలకు చెందిన 28 మహిళా సంఘాలకు ఒక్కో బస్సు కేటాయించనున్నారు. ఒక్కో బస్సు విలువ రూ.36 లక్షలు కాగా, అందులో రూ.30 లక్షలను సెర్ఫ్ ద్వారా రుణంగా అందించనున్నారు. మిగిలిన రూ.6 లక్షల మహిళా సంఘాల సభ్యులు భరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

June 3, 2026 / 07:48 PM IST

ఈ నెల 5 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

మంచిర్యాల జిల్లాలో ఈ నెల 5 నుంచి జరిగే పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీఈఓ చంద్రయ్య తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు జరుగుతాయని, గతంలో ఫెయిలైన 317 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

June 3, 2026 / 07:47 PM IST

పవన్​కు వేముల కౌంటర్​

NZB: జిల్లా కేంద్రంలో బీఆర్​ఎస్​ సభ్యత్వ నమోదు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి హాజరై మాట్లాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్‌కు వేముల కౌంటర్ ఇచ్చారు. మాటలు జారితే, ఎలా సమాధానం ఇవ్వాలో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తే పోయేది ఏమి లేదని పేర్కొన్నారు.

June 3, 2026 / 07:45 PM IST

‘రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి’

KNR: రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హితవు పలికారు. బుధవారం మానకొండూర్ మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన ప్రత్యేక సమవేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలకు పరిమితం కావాలన్నారు.

June 3, 2026 / 07:45 PM IST

‘ఉపాధి పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి’

WNP: చదువుకున్న ప్రతి విద్యార్థి ఏదో ఒక రంగంలో ఉపాధి పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖలో చాలా మార్పులు తీసుకొస్తుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. విద్యా శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై బుధవారం రాష్ట్ర సెక్రటరీ ఎడ్యుకేషనల్ యోగిత రాణా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

June 3, 2026 / 07:44 PM IST

వీహెచ్‌కు శుభాకాంక్షలు తెలిపిన వంటేరు

SDPT: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సలహాదారుగా (కేబినెట్ హోదా) నియమితులైన సీనియర్ నేత వీ.హనుమంతరావును గజ్వేల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని వీహెచ్ నివాసంలో ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. వీహెచ్ అనుభవం బీసీల అభ్యున్నతికి తోడ్పడుతుందని నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

June 3, 2026 / 07:38 PM IST

శిథిలావస్థకు చేరిన వ్యవసాయ శాఖ కార్యాలయ భవనం

ASF: తిర్యాణి వ్యవసాయ శాఖ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. గోడలకు పగుళ్లు వచ్చి, పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతుండటంతో సిబ్బంది, రైతులు భయంతో విధులు నిర్వహిస్తున్నారు. రోజూ 50-60 మంది రైతులు పంట రుణాలు, పథకాలు, ఎరువుల సబ్సిడీ కోసం వస్తుంటారు. ఏ క్షణంలో కూలుతుందో తెలియదు అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

June 3, 2026 / 07:34 PM IST

మిషనరేట్​లో భారీగా ఎస్సైల బదిలీలు

NZB: జిల్లా పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో 20 మంది సబ్​ ఇన్​స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం కీలక పోస్టింగ్​లో ఉన్న వారిని తప్పించి లూప్​లైన్​కు బదిలీ చేశారు. అలాగే లూప్​లైన్​, ఎస్సై–2లుగా కొనసాగుతున్న వారికి ఎస్​హెచ్​వోలుగా బాధ్యతలు కట్టబెట్టారు. ఇందల్వాయి ఎస్సై సందీప్​ను ధర్పల్లి ఎస్సైగా బదిలీ చేశారు.

June 3, 2026 / 07:34 PM IST

కమిషనరేట్​లో భారీగా ఎస్సైల బదిలీలు

NZB: జిల్లా పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో 20 మంది సబ్​ ఇన్​స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం కీలక పోస్టింగ్​లో ఉన్న వారిని తప్పించి లూప్​లైన్​కు బదిలీ చేశారు. అలాగే లూప్​లైన్​, ఎస్సై–2లుగా కొనసాగుతున్న వారికి ఎస్​హెచ్​వోలుగా బాధ్యతలు కట్టబెట్టారు. ఇందల్వాయి ఎస్సై సందీప్​ను ధర్పల్లి ఎస్సైగా బదిలీ చేశారు.

June 3, 2026 / 07:34 PM IST

అలరించిన కవిత.. ‘తరగతి గది ఖాళీగా వుంది’

NLG: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా HYDలో జరిగిన కవిసమ్మేళనంలో చిట్యాల మండలం వట్టిమర్తి వాసి డా. నర్రా ప్రవీణ్ రెడ్డి ‘తరగతి గది ఖాళీగా వుంది’ కవితను వినిపించి అలరించారు. పేదరికం వల్ల విద్యకు దూరమవుతున్న పిల్లల దుస్థితిని కళ్ళకు కట్టినట్లు కవితలో వినిపించి సభికుల ప్రశంసలు పొందారు. భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి జ్ఞాపికతో సత్కరించారు.

June 3, 2026 / 07:33 PM IST