NZB: జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో 20 మంది సబ్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం కీలక పోస్టింగ్‌లో ఉన్న వారిని తప్పించి లూప్లైన్కు బదిలీ చేశారు. అలాగే లూప్‌లైన్, ఎస్సై–2లుగా కొనసాగుతున్న వారికి ఎస్హెచ్వోలుగా బాధ్యతలు కట్టబెట్టారు. ఇందల్వాయి ఎస్సై సందీప్‌ను ధర్పల్లి ఎస్సైగా బదిలీ చేశారు.