• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

హన్మకొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. మాజీ కూడా ఛైర్మన్ మర్యాదవ్ రెడ్డి పాల్గొన్నారు.

June 3, 2026 / 07:02 PM IST

సింగరేణిలో భద్రతా అవగాహన కార్యక్రమం

భూపాలపల్లి పట్టణంలోని సింగరేణి సంస్థకు ఉద్యోగుల భద్రత అత్యంత ప్రాధాన్యమని బీహెచ్పీఎల్ ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కేటీకే- 5 భూగర్భ గనిలో బుధవారం ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గనుల్లో పనిచేసే ఉద్యోగులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.

June 3, 2026 / 07:02 PM IST

వానాకాలం సాగుపై రైతు అవగాహన సదస్సు

NLG: చిట్యాల మండలం వెలిమినేడు పీఏసీఎస్ ఆధ్వర్యంలో బుధవారం రైతులకు వానాకాలం సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంఘం ఛైర్మన్ ఏనుగు రఘుమా రెడ్డి మాట్లాడుతూ, రైతులు శాస్త్రీయ పద్ధతులు పాటిస్తూ లాభసాటి వ్యవసాయం చేయాలని సూచించారు. విత్తనాలు, ఎరువుల వినియోగం, ప్రభుత్వ పథకాలపై నిపుణులు అవగాహన కల్పించారు. తహసిల్దార్ విజయకుమార్, ఏవో గిరిబాబు పాల్గొన్నారు.

June 3, 2026 / 07:00 PM IST

‘ఉపాధి హామీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి’

NRML: ఉపాధి హామీ పథకం కింద పానది రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అధికారులను ఆదేశించారు. నిధులు మంజూరైనప్పటికీ పనులు ఆలస్యం కావడం సరికాదని పేర్కొన్నారు. వర్షాకాలంలో రైతులకు ఇబ్బందులు లేకుండా మిగిలిన రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు సూచించారు.

June 3, 2026 / 07:00 PM IST

చైన్ స్నాచింగ్ ఘటనలపై ఎస్సై హెచ్చరిక

NZB: బాల్కొండ మండల కేంద్రంలో పెరుగుతున్న చైన్ స్నాచింగ్ సంఘటనల నేపథ్యంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శైలేందర్ సూచించారు. ముఖానికి మాస్కులు, క్యాపులు ధరించిన అపరిచితుల పట్ల మరింత నిఘా ఉంచాలని, ఒంటరిగా వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే 8712659860, 8712659756 నెంబర్‌కు సంప్రదించాలన్నారు.

June 3, 2026 / 07:00 PM IST

అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ పై న్యాయవాదుల హర్షం

PDPL; రాష్ట్ర అవతరణ రోజున ప్రభుత్వం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం హర్షనీయమని నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం కోర్టు ఆవరణలో వారు అసోసియేషన్ సభ్యులు స్వీట్స్ పంపిణీ చేశారు. న్యాయవాదుల భద్రత, రక్షణకు ప్రభుత్వం తెచ్చిన చట్టం అభినందనీయమని పేర్కొన్నారు.

June 3, 2026 / 07:00 PM IST

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: SP అఖిల్ మహాజన్

ADB: విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందని SP అఖిల్ మహాజన్ అన్నారు. జనవరి 5న గుండెపోటుతో మరణించిన కానిస్టేబుల్ రాథోడ్ విలాస్ కుటుంబానికి మంజూరైన రూ.8 లక్షల ఆర్థిక సహాయ పత్రాలను అతని భార్య జ్యోతికి బుధవారం అందజేశారు. విలాస్ మరణం పోలీసు శాఖకు తీరని లోటని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.

June 3, 2026 / 06:51 PM IST

‘డయల్ 100 కాల్స్‌‌కు తక్షణమే స్పందించాలి’

MNCL: శాంతిభద్రతల పరిరక్షణలో బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ల పాత్ర కీలకమని అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్ అన్నారు. బుధవారం రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఎస్‌హెచ్‌ఓలు, బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. డయల్ 100 కాల్స్‌‌‌కు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

June 3, 2026 / 06:50 PM IST

బచ్చన్నపేటలో రైతుల సమస్యలపై నాయకుల విమర్శలు

JN: బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా ధాన్యం సేకరించకపోవడంపై మాజీ సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు సతీశ్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఫిరోజ్ మండిపడ్డారు. వర్షాకాలం ముంచుకొస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై వారు విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

June 3, 2026 / 06:45 PM IST

రెండు కొత్త సెక్షన్ కంట్రోల్ బోర్డులు పరిశీలన

HYD: సికింద్రాబాద్ సంచాలన్ భవన్‌లో ఎస్‌సీఆర్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ రెండు కొత్త సెక్షన్ కంట్రోల్ బోర్డులను పరిశీలించారు. సికింద్రాబాద్ డివిజన్‌లోని కొత్త సెక్షన్లలో (వాడి-రాయచూర్, పగిడిపల్లి-విష్ణుపురం-జనపహాడ్) రైలు రాకపోకల పర్యవేక్షణ కోసం చేపట్టిన కార్యాచరణ ఏర్పాట్లను ఆయన సమీక్షించి, అధికారుల సన్నద్ధతపై సంతృప్తి వ్యక్తం చేశారు.

June 3, 2026 / 06:41 PM IST

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

BDK: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక”లో భాగంగా జూన్ 4, 6, 8, 10 తేదీల్లో జరిగే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్యం, వానాకాల సన్నద్ధత, వ్యవసాయం, ఓటరు జాబితా సవరణ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

June 3, 2026 / 06:38 PM IST

‘పేదల హక్కుల కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలి’

MHBD: కేసముద్రంలో నేడు జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం 3వ జిల్లా మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షుడు జీ. నాగయ్య పాల్గొన్నారు. భూమిలేని పేదలకు భూముల పంపిణీ చేయాలని, ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ. 600 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కూలీ బందు, ఇళ్ల స్థలాలు, పోడు భూముల హక్కు పత్రాల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ.. పేదల హక్కుల కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు.

June 3, 2026 / 06:34 PM IST

‘పవన్ కళ్యాణ్ భాష మార్చుకోవాలి’

KMM: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భాష, పద్ధతి మార్చుకోవాలని సీపీఐ రాష్ట్ర నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారుడు గద్దర్ గురించి మాట్లాడే ముందు తెలుసుకోవాలని సూచించారు. గద్దర్‌ను పట్టించుకోలేదన్న పవన్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

June 3, 2026 / 06:33 PM IST

రీజినల్ డిప్యూటీ డైరెక్టర్‌కు ఘన సత్కారం

WGL: జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగం రీజినల్ డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజాను TNSF నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌కు బదిలీపై వెళ్తున్న బీ. సీతారాములును కూడా బొకే, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో TNSF రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ తదితరులు ఉన్నారు.

June 3, 2026 / 06:33 PM IST

పురపాలికలో వార్డు సభలు

NLG: చిట్యాల పట్టణంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ముగింపు వారోత్సవాల్లో భాగంగా జూన్ 4,6,8,10 తేదీల్లో వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు ఛైర్ పర్సన్ పందిరి గీత తెలిపారు. కమిషనర్ గురులింగం, కౌన్సిలర్లు, సిబ్బందితో బుధవారం జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘వనమహోత్సవం’ జరపనున్నారు.

June 3, 2026 / 06:32 PM IST