SRPT: మేళ్లచెరువు లింగేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర వచ్చేనెల ఫిబ్రవరి 15 నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ రేపు ఆలయంలో సమావేశం నిర్వహించనున్నారు. దేవస్థానంలో నిర్వహించే సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని కలెక్టర్ కార్యాలయ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో .
MLG: మేడారం మహాజాతరలో జంపన్నవాగు సూర్యాస్తమయ సమయంలో అద్భుత దృశ్యాన్ని సృష్టించింది. సూర్యకిరణాలు వాగు పై పడటంతో నీరు పూర్తిగా ఎరుపు రంగులో మారింది. చారిత్రక కథనాల ప్రకారం సమ్మక్క కుమారుడు జంపన్న వీరమరణం పొందిన సమయంలో వాగు ఎర్రబడినట్లు చెబుతారు. ఇప్పుడు వాగు నిండుకుండలా ఎరుపురంగులో వెలిగిపోతుండటంతో భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోతున్నారు.
SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో స్వయం సహాయక బృందాల మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. స్థానిక మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి మహిళ సంఘాల బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హనుమత్, మున్సిపల్ సిబ్బంది మహిళలు తదితరులు ఉన్నారు.
NRML: మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ టౌన్ సీఐ నైలు హెచ్చరించారు. శాంతినగర్ ప్రాంతంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని గుర్తించి కేసులు నమోదు చేశారు. వాహన ధ్రువపత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సీఐ సూచించారు.
SRPT: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ RO, ARO నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలకు అధికారులు కేటాయించబడ్డారు. ప్రతి 2-3 వార్డులకు ఒక RO/ARO ఉండేలా ప్రణాళిక రూపొందించగా, అత్యవసర పరిస్థితుల కోసం ప్రతి మున్సిపాలిటీలో 10% రిజర్వ్ అధికారులను సిద్ధంగా ఉంచారు.
PDPL: ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ధర్మారంలో మంత్రి లక్ష్మణ్ కుమార్తో కలిసి పర్యటించి ఏర్పాట్లపై సమీక్షించారు. సమయం తక్కువ ఉన్నందున భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
BHPL: మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగే సమయం సమీపిస్తుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో ఛైర్మన్ స్థానాన్ని ‘బీసీ జనరల్’కు కేటాయించడంతో ఆ వర్గ నేతల్లో ఆశలు పుంజుకున్నాయి. 30 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల ఎంపిక పై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. దీంతో ఆశవాహల్లో సందడి నెలకొంది.
WGL: గీసుగొండ మండలం ఊకల్ శ్రీనాగేంద్ర స్వామి ఆలయంలో మంగళవారం ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శన చార్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉదయం నుంచి ఆలయానికి భక్తులు చేరుకుని కొబ్బరికాయలు కొట్టి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకుడు శ్రీహర్ష, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
ADB: ప్రభుత్వానికి ప్రజా సమస్యలకు మధ్య వారధిగా పత్రిక పని చేయాలని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మంగళవారం నేరడిగొండ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజా గొంతుకగా సమస్యల కేంద్రంగా జర్నలిస్టులు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
ASF: కౌటాల మండలం జనగామ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో దీపాలి అనే మహిళకు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. దీంతో 108కి సమాచారం అందించగా EMT ఆజయ్ కుమార్, పైలట్ సురేష్ క్షతగాత్రురాలికి ప్రథమ చికిత్స అందించి సిర్పూర్ సామాజిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.
KMR: భిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డికి చెందిన అవుసుల కార్తీక్(12) రెండంతస్తుల భవనంపై నుంచి కిందపడి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. సంక్రాంతి రోజు భవనంపై గాలిపటాలు ఎగరవేస్తుండగా ప్రమాదవశత్తు కిందపడినట్లు చెప్పారు. తీవ్ర గాయాలైన బాలుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
KNR: సమాజంలోని రుగ్మతలను ప్రశ్నించడానికి కార్టూన్ ఓ శక్తివంతమైన మాధ్యమమని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. సోమవారం ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల వ్యంగ్య చిత్ర కళా శిక్షణను ఆమె ప్రారంభించారు. వేగవంతమైన ఈ ప్రపంచంలో తక్కువ సమయంలోనే లోతైన ప్రభావం చూపే శక్తి కార్టూన్లకు ఉందన్నారు.
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ ప్రధాన రహదారిపై నేడు జాతీయ భద్రత మాస ఉత్సవాలను కార్పోరేటర్ తొట్ల రాజు యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారి నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. స్థానిక సీఐ పుల్యాల కిషన్, రాజకుమార్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
MNCL: తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే 5 నెలల ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల ఉపసంచాలకులు దుర్గప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన SC, ST, BC, మైనారిటీలు ఈనెల 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
JGL: బీర్పూర్ మండల రైతు వేదికలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కల్యాణ లక్ష్మీ, సీఎం సహాయ నిధి చెక్కులు సోమవారం పంపిణీ చేశారు. మండలానికి చెందిన 30 మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. 30.03 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. అలాగే ఐదుగురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేసి, పథకాలు అర్హులకు చేరాయన్నారు.