SRPT: మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింతకాయల అరుణ్ తన గొర్రెల మందను చెరువు వద్దకు నీరు తాగించడానికి తీసుకువెళ్లగా, విద్యుత్ షాక్తో 23 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. చెరువులో వ్యవసాయ మోటార్లకు ఉన్న విద్యుత్ వైరు నీళ్లలో పడి చెరువు నీటిలో విద్యుత్ సరఫరా కావడంతో ఈ ఘటన జరిగింది.