LPG కొరత మొబైల్స్, ఇంటర్నెట్ సేవలపై కూడా తీవ్ర ప్రమాదం పడనుంది. టెలికాం టవర్ తయారీ సంస్థలకు గ్యాస్ సప్లై ఆగిపోవడమే ఇందుకు కారణమని సమాచారం. టెలికాం టవర్లు తుప్పు పట్టకుండా తయారీ సమయంలో జింక్‌తో వేసే రక్షణ పొరకోసం LPGని వాడతారు. అయితే LPG కొరతతో ఈ ఆపరేషన్స్ నిలిపివేయాలని ప్రొడక్షన్ కంపెనీలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే నెట్ వర్క్ కనెక్టివిటీ తగ్గే ప్రమాదం ఉంది.