NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఈనెల 13,14 తేదీల్లో వైభవంగా జరగనున్నాయి. 13న మహారుద్ర హోమం, శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, చిన్న రథోత్సవం, అన్నదానం నిర్వహిస్తారు. 14న చక్ర రథోత్సవం, అగ్ని గుండాలు, పెద్ద రథోత్సవం ఉంటాయి. అదేరోజు రాత్రి ఫోక్ సింగర్స్చే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.