TG: కంపెనీలకు భూముల కేటాయింపుల ద్వారా ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రూ.81,800 కోట్ల పెట్టుబడులతో 6 కంపెనీలకు భూములు కేటాయించామని, మరో 3 కంపెనీలకు రూ.30 వేల కోట్ల పెట్టుబడుల కోసం భూములను గుర్తించినట్లు పేర్కొన్నారు. పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల బహుళ ప్రయోజనాలు, ఉపాధి లభిస్తుందన్నారు.