RR: షాద్నగర్ నియోజకవర్గం వెల్జర్ల గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రథోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి పాల్గొన్నారు. ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు అని గ్రామస్తులు పేర్కొన్నారు. రథోత్సవం సందర్భంగా భక్తులు ఆటపాటలతో అలరించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.