TG: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పర్యటించనున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) సమావేశాల్లో పాల్గొంటారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, జిల్లాల వ్యాప్తంగా దాని పరిధిని విస్తరించడంపై ఈ సమావేశాలు కీలకం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూడా నాయకులు వివరిస్తారు.