WNP: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈనెల 12న నిర్వహించబోయే గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్ల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు.