HYD: చార్మినార్ టాస్క్ ఫోర్స్, అంబర్పేట పోలీసులు 2వ భార్య హత్య కుట్రను ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అరుణ్ తన 2వ భార్యపై అనుమానంతో హత్య చేయడానికి పథకం వేశాడు. మహమ్మద్ అబ్బు, మీర్ ముజమ్మిల్ అలీ ఖాన్ సహకారంతో బీహార్ నుంచి దేశవాళీ పిస్టల్, 6 రౌండ్లు, మ్యాగజైన్ కొనుగోలు చేశాడు. 9న అలీ కేఫ్ వద్ద సమావేశమైన సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు.