BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి భక్తుల కానుక రూపంలో వచ్చిన 28 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. అందులో నగదు రూ.1,86,44,511. మిశ్రమ బంగారం 57 గ్రాముల, 500 మిల్లీ గ్రాములు, మిశ్రమ వెండి 2 KG 750 గ్రాములు, స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.