SDPT: ఏపీ Dy. CM పవన్ కళ్యాణ్ బుధవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమం గురించి చేసిన వ్యాఖ్యలను అక్కన్నపేట మండల అధ్యక్షులు జంగపెల్లి ఐలయ్య తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి దయాదాక్షిణ్యాలతోనో, రాజకీయ ఒప్పందాలతోనో ఏర్పడలేదని, లక్షలాది మంది ప్రజల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందని అన్నారు.
కృష్ణ మండలం హిందూపూర్ గ్రామానికి చెందిన అంజి భారత సైన్యంలో ఉద్యోగం సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా పాఠశాలలో హెచ్‌ఎం ఆయనను అభినందించి సన్మానించారు. నిరుపేద కుటుంబం నుంచి కష్టపడి దేశ రక్షణ విధులకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని అంజి తెలిపారు. దేశ సేవను మించిన భాగ్యం లేదని పేర్కొన్నారు.
MDK: తూప్రాన్ పట్టణ వార్డుల్లో 4 నుంచి వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వార్డు సభల నిర్వహణపై మున్సిపాలిటీలో సమావేశం నిర్వహించారు. పట్టణంలో 4న 1,2,5,7 వార్డులు, 6న 3,6,8,12 వార్డులు, 8న 4,9,10,13 వార్డులు, 10న 11,14,15,16 వార్డులలో సభలు ఉంటాయన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు ఆవరణలో గుండె నొప్పితో అకస్మాత్తుగా కుప్పకూలిన వ్యక్తికి కొనరావుపేట కోర్టు కానిస్టేబుల్ భాస్కర్ సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ఇల్లంతకుంట మండలం కట్కూరు గ్రామానికి చెందిన వెంకటేశం కోర్టుకు హాజరైన సమయంలో అస్వస్థతకు గురికాగా, వెంటనే స్పందించిన భాస్కర్ సీపీఆర్ అందించడంతో ఆయన స్పృహలోకి వచ్చారు
PDPL: జూన్ 4 నుంచి నిర్వహించే గ్రామ, వార్డు సభల ద్వారా ప్రభుత్వ సందేశాన్ని ప్రతి ఇంటికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడదెబ్బ మృతులకు ఎక్స్‌గ్రేషియా, జాతీయ ప్రయోజనా పథకం గురించి వివరించాలని తెలిపారు.
ASF: ఆసిఫాబాద్ జిల్లాలో గత 24 గంటల్లో దహెగాంలో అత్యధికంగా 41.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. బెజ్జార్, రెబ్బెన మండలాల్లో 41.2 డిగ్రీలు, కాగజ్‌నగర్, సిర్పూర్ (టి)లో 41.1 డిగ్రీలు నమోదయ్యాయి. పెంచికల్‌పేట్ 41.0, తిర్యాణి 40.9, కౌటాల 40.8, ఆసిఫాబాద్ 40.4, సిర్పూర్(యూ)లో 40.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఎండలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
HNK: సైబర్ క్రైమ్ విషయంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. కేసుల పరిష్కారంలో మరింత ముందుండేలా చూడాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సైబర్ క్రైమ్ ఏసీపీగా వెంకటరమణ బుధవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం సీపీని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
KNR: సైదాపూర్ మండల పశువైద్యాధికారిగా డాక్టర్ నోముల రణధీర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళ్లిన డాక్టర్ విజేందర్ రావు స్థానంలో ఆయన నియమితులయ్యారు. స్థానిక పశువైద్యశాలలో విధుల్లో చేరిన సందర్భంగా సిబ్బంది, రైతులు స్వాగతం పలికారు. పశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి, పాడి రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని రణధీర్ రెడ్డి తెలిపారు.
NLG: చిట్యాల మండలం వెలిమినేడు వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న వాహనాన్ని వెనుక నుండి డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్‌కు తీవ్ర గాయాలవ్వడంతో, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
NLG: చిట్యాల మండలం వెలిమినేడు వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న వాహనాన్ని వెనుక నుండి డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్‌కు తీవ్ర గాయాలవ్వడంతో, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ సునీత – రవీందర్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకం వంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాల HM, ఉప సర్పంచ్, తదితరులు ఉన్నారు.
NRML: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-14 టీ20 క్రికెట్ పోటీల్లో నిర్మల్ అర్బన్ జట్టు విజేతగా నిలిచింది. నిర్మల్‌లోని లక్కీ క్రికెట్ మైదానంలో బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నిర్మల్ అర్బన్, రూరల్ జట్లు తలపడగా నిర్మల్ అర్బన్ జట్టు విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
MDK: కొల్చారం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పెండింగ్ కేసులు త్వరగా పూర్తి చేయాలని, నంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అక్కడి సిబ్బందికి సూచించారు. అనంతరం స్టేషన్ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది విధుల నిర్వహణ, తదితర అంశాలను పరిశీలించారు.
HYD: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ జయేష్ రంజన్ మియాపూర్ సర్కిల్‌లోని పెద్దకుడి చెరువు, పటేల్ చెరువులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. జాతీయ రహదారి, పలు కాలనీల్లో నీరు నిలిచే ప్రాంతాలను సమీక్షించి, డ్రైనేజీ మెరుగుదల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
MNCL: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిరుపేదల సొంతింటి కల నెరవేరుతుందని సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ZPTC సంతోశ్ కుమార్ అన్నారు. వేమనపల్లి మండలం గొల్లపల్లిలో ఇందిరమ్మ ఇంటి పథకం కింద నిర్మించిన పలు ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో వారు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు.