NRML: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పెంబి ఎస్సై హనుమాన్లు సూచించారు. మందపల్లి గ్రామంలో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, రహదారులపై పరిమితికి మించి వేగంగా వాహనాలు నడపవద్దని సూచించారు. ట్రాఫిక్ నియమాల పాటనే ప్రాణ భద్రతకు మార్గమని తెలిపారు.
HNK: ఆత్మకూరు మండలం ఆగ్రహంపహాడ్ సమీపంలో గల సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. మినీ మేడారం జాతరకు మరో 8 రోజుల సమయం మాత్రమే ఉంది. మేడారం మహా జాతర తర్వాత అత్యధికంగా భక్తులు ఆగ్రహంపహాడ్ వస్తుంటారని స్థానికులు తెలిపారు. జాతరకు అధికారులు అని ఏర్పాట్లు చేస్తున్నారు.
KMM: జిల్లా కలెక్టరేట్‌లో నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జనవరి 26 సందర్భంగా కలెక్టర్ సందేశం తయారీ కోసం ప్రతి శాఖ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరించాలన్నారు.
NGKL: జిల్లా సాధారణ ఆసుపత్రిలో మంగళవారం మహిళలకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ శేఖర్ తెలిపారు. స్త్రీ వైద్య నిపుణులు నీలిమ, సుప్రియల బృందం ఆధ్వర్యంలో ఈ శిబిరం కొనసాగనుంది. ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి రక్షణ పొందేందుకు జిల్లాలోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత దోమ పరమేశ్వర్‌ను సేవా రత్న పురస్కారం వరించింది. సోమవారం హైదరాబాదులోని టూరిజం ప్లాజా హోటల్‌లో బాబు జగ్జీవన్ రామ్ ఉత్సవ కమిటీ చైర్మన్ ఇటుక రాజు చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ మాట్లాడుతూ.. తనకు పురస్కారం అందించిన కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని వెల్లడించారు.
ADB: మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ భేటీ బచావో బేటి పడావోలో భాగంగా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉట్నూర్లో అవగాహన నిర్వహించారు. ఇంఛార్జ్ డిస్ట్రిక్ మిషన్ కోఆర్డినేర్ కోటేశ్వర్ మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల మానసిక శారీరక సమస్యలు వస్తాయని వివరించారు. బాల్య వివాహలతో విద్య అక్షరాస్యత అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు.
JGL: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన జైనపురం త్రిష జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైంది. నారాయణపేట జిల్లాలో జరిగిన అండర్-17 రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి, ఈనెల 19 నుంచి 23 వరకు గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్‌లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొననుంది. ఈ ఎంపికపై హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు, గ్రామ ప్రజలు త్రిషను అభినందించారు.
BDK: కొత్తగూడెం ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం ఘోరం జరిగింది. అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందిందని ఆసుపత్రి ముందు బంధువులు బైఠాయించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐ శివ ప్రసాద్, ఎస్ఐ విజయ కుమారి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
MNCL: మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక పథకాల ద్వారా చేయూత అందిస్తున్నామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అన్నారు. మహిళ సంఘాల సభ్యులకు రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ త్వరగా పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని నిర్వహించిన సమావేశంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.
KNR: సైదాపూర్ మండలంలోని ఎలబోతారం గ్రామంలో సర్పంచ్ నమింన్ల రవీందర్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం క్రికెట్ కిటు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిన క్రికెట్ కిట్లను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
KMM: ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై. రమేష్‌కు ప్రతిష్ఠాత్మక “బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు” లభించింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఏసీబీ డీజీ చారు సిన్హా చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఖమ్మం రేంజ్‌లో అవినీతి కేసుల దర్యాప్తులో కనబరిచిన నిబద్ధత, సమర్థతకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఉన్నతాధికారులు ఆయనను అభినందించారు.
SRPT: చిన్నారులను పనుల్లో పెట్టుకుంటే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి హెచ్చరించారు. ‘ఆపరేషన్ స్టైల్ – Xll’ కార్యక్రమంలో భాగంగా షీ టీం సభ్యులతో కలిసి, సోమవారం రాత్రి రామాపురం క్రాస్ రోడ్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఓ ఆటోమొబైల్ షాప్‌లో పనిచేస్తున్న ఇద్దరు మహిళలను విడిపించి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
NZB: తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు, సమగ్రాభివృద్ధి, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, వనరుల వినియోగంపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన 50 కమిటీల సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం సమావేశం అయ్యారు. కమిటీ సభ్యులు ప్రజాభిప్రాయం మేరకు రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని నివేదించారు.
KMM: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 2 వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు తిరుపతి శ్రీనుతో పాటు పలు కుటుంబాలు నిన్న హైదరాబాద్ లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ వారికి కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో BRS పార్టీకి ప్రజా ధారణ పెరిగిందని అన్నారు.
PDPL: Dy.CM బట్టి విక్రమార్క సోమవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణాలలోని మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అధికారులు సమీకృత కలెక్టరేట్లో సమావేశంలో పాల్గొన్నారు.