SRPT: ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాను తనిఖీ చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురై సైదులు అనే యువ రైతు మృతి చెందాడు. మంగళవారం చివ్యెంల మండలం వట్టిఖమ్మం పహాడ్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన సైదులు, కరెంట్ సరఫరాను సరిచేసే క్రమంలో ప్రాణాలు వదలడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.