• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

15 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం

KMM: బోనకల్ మండలం బ్రాహ్మణపల్లిలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. నూతన సబ్ స్టేషన్ సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ నుంచి మంటలు చెలరేగి, పక్కనే ఉన్న మొక్కజొన్న పొలాలకు విస్తరించాయి. ఈ ప్రమాదంలో సుమారు 15 ఎకరాల్లో పంట కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది నుంచి స్పందన లేకపోవడంతో స్థానిక రైతులే స్వయంగా మంటలను అదుపు చేశారు.

May 5, 2026 / 05:15 PM IST

మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కవిత

MHBD: కేసముద్రంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని BRS పార్టీ జిల్లా అధ్యక్షురాలు కవిత సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు వెంటనే గన్ని బ్యాగులను అందజేసి మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు వెనువెంటనే డబ్బులు చెల్లించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు.

May 5, 2026 / 05:14 PM IST

లైన్స్ క్లబ్ వారిచే పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ

NLG: విద్యార్థులు అంకితభావంతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మునుగోడు లైన్స్ క్లబ్ అధ్యక్షులు నారబోయిన రవి అన్నారు. లయన్స్ క్లబ్, మునుగోడు వారి ఆధ్వర్యంలో మంగళవారం పేద విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీఐ రాములు, తహసీల్దార్ నరేష్, ఎస్సై ఇరుగు రవి, రాజీవ్ రెడ్డి, శివకుమార్, సర్పంచ్ రామాదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

May 5, 2026 / 05:11 PM IST

‘మీ-సేవ నిర్వాహకులకు ‘తహసీల్దార్’ అల్టిమేటం’

MNCL: జన్నారం మండలంలోని మీ-సేవ కేంద్రాల పనితీరుపై నూతన తహసీల్దార్ జి. బక్కయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో బాధ్యతలు చేపట్టిన ఆయన, మండలంలోని 29 గ్రామ పంచాయతీల పరిధిలో కొనసాగుతున్న మీ-సేవ కేంద్రాల తీరుపై సమీక్ష నిర్వహించి, నిర్వాహకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లోని ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఈ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

May 5, 2026 / 05:11 PM IST

బాధితులను పరామర్శించిన మంత్రి

KNR: కరీంనగర్ జ్యువెల్లరీ షాప్ కాల్పుల ఘటనలో గాయపడి కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంగళవారం రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

May 5, 2026 / 05:11 PM IST

ములుగు సమగ్రాభివృద్ధికి కృషి: మంత్రి

MLG: జిల్లా కేంద్రంలో నిర్వహించిన హనుమాన్ నగర సంకీర్తన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం హనుమాన్ స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు. సీతక్క మాట్లాడుతూ… హనుమాన్ ఆశీస్సులతో ములుగు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని, హనుమాన్ నగర సంకీర్తన కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం అభినందనీయమన్నారు.

May 5, 2026 / 05:11 PM IST

ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు

WGL: వర్ధన్నపేట పట్టణంలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన, శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి హాజరై మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకుని రైతులు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

May 5, 2026 / 05:10 PM IST

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం: మంత్రి

KMM: రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాలో ఆయన మాట్లాడారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

May 5, 2026 / 05:08 PM IST

రైతులు, నిరుద్యోగులను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్: DSP

ADB: రైతులు, నిరుద్యోగులను మోసం చేస్తున్న బరంపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీక్ అనే నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ DSP జీవన్ రెడ్డి మంగళవారం తెలిపారు. నిందితుడు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసి డబ్బు చెల్లించలేదని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. నిరుద్యోగుల నుంచి సైతం ఉద్యోగుల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు తెలియజేశారు.

May 5, 2026 / 05:02 PM IST

లబ్దిదారుడికి CMRF చెక్కు అందజేత

NRML: జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్‌కు చెందిన శేషగిరిరాజు అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించి.. బాధితుడికి రూ.2 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ ఎల్ఎసీ చెక్కును మంగళవారం అందజేశారు. మెరుగైన వైద్యం కోసం సహకరించిన ఎమ్మెల్యేకు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

May 5, 2026 / 05:01 PM IST

నూతన కలెక్టర్‌ని కలిసిన ఎస్పీ

NRPT: జిల్లా నూతన కలెక్టర్ సీహెచ్ ప్రియాంకను ఎస్పీ డాక్టర్ వినీత్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, అభివృద్ధి పనుల అమలులో పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయంపై చర్చించారు. కలెక్టర్ ప్రియాంక ఇటీవల బాధ్యతలు చేపట్టగా, జిల్లా యంత్రాంగం ఆమెకు ఘనస్వాగతం పలికింది

May 5, 2026 / 05:01 PM IST

కాలనీలలో పాదయాత్ర.. అభివృద్ధి పనుల పరిశీలన

MDCL: అల్వాల్‌లోని మా సంతోషి కాలనీ ఫేజ్-1, లక్ష్మీ ఎన్‌క్లేవ్ ప్రాంతాల్లో మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ పాదయాత్ర చేపట్టారు. అధికారులతో కలిసి ఆయన యూజీడీ, రోడ్డు పనులను పరిశీలించారు. మా సంతోషి కాలనీలో పనులు వేగంగా జరుగుతుండగా, లక్ష్మీ ఎన్‌క్లేవ్‌లో పనులకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

May 5, 2026 / 05:01 PM IST

ధాన్యం కటింగ్‌పై అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం

ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న కటింగ్‌లపై సీపీఎం నాయకులు అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. రైస్ మిల్లర్లు క్వింటాలుకు 3–6 కిలోల వరకు కట్ చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు రసీదులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

May 5, 2026 / 04:56 PM IST

తిర్యాణి పోలీస్ స్టేషన్ సందర్శించిన DSP

ASF: తిర్యాణి పోలీస్ స్టేషన్ ను DSP అశోక్ మంగళవారం సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని పెండింగ్ కేసుల వివరాలను ఎస్ఐ సుబ్బారావును అడిగి తెలుసుకున్నారు. మండలంలో గుడుంబా తయారీ, అమ్మకాలు, అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు

May 5, 2026 / 04:50 PM IST

ఈవిఎంల గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్‌లోని ఈవిఎం గోడౌన్‌ను మంగళవారం కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. గోడౌన్ సీల్‌ను పరిశీలించి భద్రతా సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. షిఫ్టుల వారీగా డ్యూటీలు సమయపాలనతో నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ తనిఖీల్లో ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

May 5, 2026 / 04:50 PM IST