HYD: ఘట్‌కేసర్ మండలం కాచవాణి సింగారంలో ఆక్రమణకు గురైన 6.12 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా సోమవారం స్వాధీనం చేసుకుంది. సర్వే నంబర్ 66లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా లేఅవుట్ వేసి ప్లాట్లుగా విక్రయించిన విద్యాసంస్థల అధినేత నల్లమల్లారెడ్డి చర్యలపై హైడ్రా కఠినంగా వ్యవహరించింది. ఏడాది క్రితం కూడా ఇదే ప్రాంతంలో హైడ్రా అడ్డుగోడలను తొలగించడం గమనార్హం.
ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని సర్దార్ బస్తి, వార్డ్ నెంబర్-5కు చెందిన వివిధ పార్టీల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో BRSలో చేరారు. వారికి మాజీ MLA కోనేరు కోనప్ప కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి BRSతోనే సాధ్యమని నమ్మి BRSలో చేరామన్నారు. అభివృద్ధి కోసం అందరి సహకారంతో ముందుకు సాగుతామని మాజీ MLA హామీ ఇచ్చారు.
NZB: వర్ని మండలం వకీల్ పాంలో కెనాల్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. గత ఐదు రోజులుగా సదరు వ్యక్తి మతిస్థిమితం లేకుండా గ్రామంలో తిరుగుతున్నాడని గ్రామస్థులు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన కెనాల్ పక్కన మృతి చెంది ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BDK: గంజాయి తరలిస్తున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్సై బాదావత్ రవిని ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించడంలో చూపిన చొరవను కొనియాడుతూ ప్రశంసా పత్రం అందజేశారు. నిన్న ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్సైకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
GDWL: అమ్మవారి చల్లని చూపు కోసం జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు అని ఆలయ అర్చకులు తెలిపారు. గద్వాల జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం జమ్మిచేడులో మంగళవారం అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేకువజామునే కృష్ణానది పవిత్ర జలాలతో అమ్మవారికి అభిషేకం చేసి, మంత్రోచ్ఛారణల మధ్య ఆకుపూజ, నిమ్మకాయ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా గోపాలమిత్ర జిల్లా అధ్యక్షులుగా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గోపాలమిత్ర ఎన్నికయ్యారు. సోమవారం గోపాలమిత్ర సమావేశం సోమవారం జిల్లా కేంద్రంలో జరిగింది. శ్రీనివాస్ గౌడ్ మూడోసారి ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గోపాలమిత్ర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
HYD: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 137 ఓపెన్ ప్లాట్లను వేలం వేయనున్నట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ ప్రకటించారు. తొర్రూర్, బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ ప్రాంతాల్లో ఉన్న ఈ ప్లాట్ల కోసం మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.
BDK: కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో ఆ పీఠం కోసం నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికార కాంగ్రెస్ నుంచి మేయర్ దక్కించుకునేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వైరా ఎమ్మెల్యే టికెట్ ఆశించిన విజయ బాయి, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న డాక్టర్ శంకర్ నాయక్ స్వప్న నాయక్ ట్రై చేస్తున్నారు.
GDWL: నడిగడ్డ ఆరాధ్య దైవం జమ్ములమ్మ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అని గద్వాల రూరల్ ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు. సోమవారం జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన ఆయన, జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నెల 27న అమ్మవారు గుర్రంగలకు వెళ్లే ప్రధాన ఘట్టంను పరిసిలించారు.
BDK: అశ్వారావుపేట మండలం, నారంవారిగూడెంలో అర్ధరాత్రి జరిగిన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పద్మ అనే మహిళ ఇంటి వరండాలో పసుపు కుంకుమ నిమ్మకాయలు జంతు పుర్రెతో పూజలు చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అమావాస్య రోజు జరిగిన ఘటనతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
MHBD: రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు భద్రత నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం కుటుంబాలను విచ్చిన్నం చేసే ప్రమాదకర అలవాటని అన్నారు.
ASF: జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నేడు కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మునిసిపల్ ఎన్నికలు, బూత్ కమిటీ కార్యశాల, వీబీ జీ రాంజీ, అటల్ బిహారీ వాజ్ పేయి సమ్మేళనం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
KMR: వేగం కన్నా ప్రాణం మిన్న అని నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ అన్నారు. సోమవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో చినూరుగ్రామానికి వెళ్లే ప్రధాన క్రాసింగ్ వద్దప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రత కోసం భారీ గేట్లను జిగ్-జాగ్ విధానంలో ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని తగ్గించేందుకు చర్యలుచేపట్టినట్లు తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించాలన్నారు.
PDPL: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ప్రమాదాలు నివారించాలని పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ కోరారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆలైవ్, అరైవ్, పది రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా మంథని పోలీసుల ఆధ్వర్యంలో రహదారి భద్రత ట్రాఫిక్ నియమాలపై ప్రధాన రహదారిపై అవగాహన సదస్సు నిర్వహించారు.