BHPL: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఐడీవోసీ కార్యాలయంలో మెడికవర్, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి ఉన్నారు.