ములుగు జిల్లా ఫైర్ ఆఫీసర్ నాగరాజు ఫిట్నెస్ కోసం ప్రారంభించిన సైక్లింగ్‌లో విశేషప్రతిభ చూపిస్తున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌పై ప్రయాణించి ఆయన రికార్డు సాధించారు. వారాంతాల్లో సుదూర ప్రాంతాలకు సైక్లింగ్ చేస్తూ వృత్తితో పాటు క్రీడల్లోనూ ప్రశంసలు అందుకుంటున్నారు. నేడు వరల్డ్ సైక్లింగ్ డే సందర్భంగా ఆయన సాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.