BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంగళవారం రోడ్డు భవనాల శాఖ, సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం తెలిపి, దర్శనం వేద, ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్య, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
NLG: శాలిగౌరారం మండలంలో 102 అమ్మఒడి అంబులెన్స్ ద్వారా గర్భిణులు, బాలింతలకు అధికారులు సేవలు అందిస్తున్నారు. ప్రతి మంగళవారం గ్రామాల నుంచి గర్భిణులను PHCకి తరలించి వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఇళ్లకు చేర్చుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉచిత రవాణా సౌకర్యంపై మహిళలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
NZB: పచ్చల నడుకుడలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం గొర్రెలు, మేకలకు ఉచితంగా అమ్మ తల్లి టీకాలు వేశారు. పశువైద్య డాక్టర్ సంతోష్ రెడ్డి, సురేశ్, బాబూలాల్ జీవాలకు టీకాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రఘుపతి రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గంగాధర్, లింగేశ్వర్ నెహ్రూ, తదితరులు పాల్గొన్నారు.
WNP: పెబ్బేరు మండల కేంద్రంలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం చౌడేశ్వరి జాతర సంర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువా, పూలమాలతో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
MDK: మెదక్-సంగారెడ్డి రహదారి గుంతలు ఏర్పడి వాహణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిలిపిచేడ్ మండలంలో రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ద్విచక్ర వాహనాలు కిందపడి గాయపడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే ఈ రహదారికి మరమ్మతు చేపట్టి ప్రమాదాలను నివారించాలన్నారు.
BDK: అశ్వారావుపేట మండలం కవడిగుండ్లలో పులి సంచరిస్తుందని గ్రామస్థుల అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు మంగళవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పాడి పంటలకు ఉపయోగపడే ఆవు అదృశ్యం అవడంతో గ్రామస్తులు వెతకగా స్థానికంగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఆవు కళేబరం దర్శనం ఇవ్వడంతో భయభ్రాంతులకు గురైనట్టు తెలిపారు.
SRD: కాంగ్రెస్ సీనియర్ నేత తాజా మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో మంగళవారం చేరారు. రాజేందర్ రెడ్డి అనుచరులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు కాసాల బుచ్చిరెడ్డి హకీం పాల్గొన్నారు.
JGL: ధర్మపురి మండలం తిమ్మాపూర్, బూరుగుపల్లి గ్రామాల పరిధిలో గత వారం రోజులుగా నిర్వహించిన క్రికెట్ టోర్నీ ముగింపు కార్యక్రమంలో ధర్మపురి సబ్ ఇన్స్పెక్టర్ జీ. మహేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా యువత క్రీడల్లో ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన సూచించారు.
WGL: నెక్కొండ మండలం రెడ్లవాడ నుంచి నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి మీదుగా వెళ్లే SRSP కాలువను ఇవాళ అధికారులు పరిశీలించారు. దెబ్బతిన్న కాలువ ప్రాంతాలను ఈఈ సురేష్, డీఈ రాందాస్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. స్థానిక రైతుల విజ్ఞప్తి మేరకు స్పందించిన అధికారులు, సాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీలైనంత త్వరగా మరమ్మతు పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
BHPL: మొగుళ్ళపల్లి మండలం కొరికిశాలలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ రాకేష్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో 100 ఖాళీ సీట్లతో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన ఖాళీలను భర్తీ చెయ్యనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 28 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
SRCL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపుల నిర్వహణ తేదీలను సోమవారం ప్రకటించారు. ఈనెల 21న మానసిక లోపం, వినికిడి సమస్యలు, 22న జనరల్, 28న ఆర్థోపెడిక్ సంబంధించిన లోపం ఉన్నవారు శిబిరానికి హజరుకావాలన్నారు. దివ్యాంగులు సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లు, ఫొటోలు తీసుకుని ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు.
ADB: ఈనెల 23, 24 తేదీలలో జరిగే ప్రాథమిక పాఠశాల కాంప్లెక్స్ సమావేశాలను వాయిదా వేయాలని తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌహన్, వలబోజు గోపికృష్ణ కోరారు. ఈ విషయమై కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. 23వ తారీకు వసంత పంచమి, 25న ఆదివారం కావున పాఠశాలలో ఆటల పోటీలు, జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం లేదని విన్నవించారు.
BDK: సారపాకలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాలతో గోదావరి నదిలోకి ట్రాక్టర్లు వెళ్లకుండా తహసీల్దార్ చర్యలు చేపట్టారు. నదికి వెళ్లే మార్గాల్లో పోల్స్ ఇనుప తీగలతో కంచె ఏర్పాటు చేశారు. పోలీస్ నిఘా పెంచి ఇసుక దందాకు చెక్ పెడుతున్నారు. ప్రజలే పోలీస్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందిస్తున్నారు.
SRCL: ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలోని ఫెర్జిలైజర్, ఫెస్టిసైడ్, సీడ్స్ దుకాణ నిర్వాహకుడు నాసిరకం ఎరువులను విక్రయించారని, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్కరికి రూ. 800 చొప్పున ఇస్తామని దుకాణదారుడు చెప్పడంతో రైతులు శాంతించారు. మండల వ్యవసాయాధికారిణి అనూష చేరుకుని దుకాణాన్ని, రికార్డులను తనిఖీ చేశారు.