SRD: పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో డంప్ యార్డును మున్సిపల్ శాఖ జేడీ సంధ్య మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఈ మేరకు పట్టణంలోని పరిసర ప్రాంతాలను కూడా ఆమె పర్యవేక్షించారు. జేడీ సంధ్య స్థానిక మున్సిపల్ కమిషనర్, సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.