AP: ఈనెల 14న అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, నగరాలు, పంచాయతీల్లో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పార్టీ పతాకాన్ని జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, సభ్యత్వం పొందిన వారి సమక్షంలో ఎగురవేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి జనసేన ఏ విధంగా ముందుకు వెళ్తుందో ప్రజలకు నాయకులు వివరించాలన్నారు.