E.G: చాగల్లు PHC పరిధిలో బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలకు తల్లిదండ్రుల అనుమతితో ఈ టీకాలు వేస్తున్నట్లు వైద్యాధికారి తనుజ తెలిపారు. మూడు నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా బాలికలందరూ ఈ టీకా వేయించుకోవాలని ఆమె సూచించారు.