PDPL: ధర్మారం మండలం మేడారంలో ఈనెల 12 నుంచి యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి పట్నాల మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఇవాళ సర్పంచ్ వీర్పాల్, ఉప సర్పంచ్ రవి కుమార్ను కలిసి ఉత్సవానికి ఆహ్వానించారు. ఈ ఉత్సవంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.