AKP: అచ్యుతాపురం మండలంలో పలు గ్రామాలకు నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని EE రాజశేఖర్ తెలిపారు. రహదారి విస్తరణ పనులు జరుగుతున్న కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అచ్యుతాపురం రోడ్డు, చాకలిపేట, మోసయ్యపేట, చోడపల్లి, రామన్నపాలెం, భోగాపురం రోడ్డు, పూడిమడక రోడ్డు తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.