TG: స్టేషన్ ఘన్పూర్ MLA కడియం శ్రీహరి, ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌కు ఊరట లభించింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వారి అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇప్పటికే 8 మంది MLAలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో ఇవాళ నిర్ణయం వెల్లడించారు.