TG: గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేంటి అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. తలసాని, సబితకు మంత్రి పదవులు ఎలా ఇచ్చారని, తాను ఎంపీగా పోటీ చేసినప్పుడు పార్టీ గానీ, కేసీఆర్ గానీ తనను ఏమీ అడగలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే.. ఇద్దరూ కలిసి తనను ఎంపీగా ఓడించారని ఆరోపించారు. ఆరుసార్టు ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు చట్టాల గురించి తెలుసని పేర్కొన్నారు.