NRML: తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సాదం అరవింద్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను శుక్రవారం ఘనంగా సత్కరించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. కెమిస్ట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అరవింద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.