వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దాహం వేయకపోయినా తరచుగా నీరు, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. నూనె, మసాలాలు తగ్గించి.. పండ్లు, మజ్జిగ వంటి చలవ చేసేవి తీసుకొవాలి. వదులైన కాటన్ బట్టలు ధరించాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ఎండలో వెళ్లకపోవడమే మంచిది. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, సన్ గ్లాసెస్ వాడాలి.