SRPT: మోతే మండలంలోని రాఘవాపురం ఎక్స్ రోడ్డు సమీపంలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రాంబాబు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై సూర్యాపేట వైపు వెళ్తుండగా, వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువను బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో ఆయన కాలు విరిగి తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.