BHNG: గురుకుల పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. మోత్కూరు ఎస్సీ బాలుర పాఠశాలను ఆయన ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతులను పరిశీలించి, వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీలో ఎంఆర్వో, ఎంపీడీవో, పాల్గొన్నారు.