PDPL: జిల్లాలో అర్హులైన 14 నుంచి 15 సంవత్సరాలు గల బాలికలు అందరికీ HPV టీకాల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు ఇవాళ ఆయన అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నివారణకు టీకాలు దోహదపడతాయన్నారు. జిల్లాలోని అన్ని ప్రధాన ఆసుపత్రులతో పాటు UHC, PHCలలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు టీకాలు వేస్తారని వెల్లడించారు.