ATP: గుత్తి ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారని, అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరారు.