MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈ నెల 16న మహిళలు, 17న పురుషుల ఖోఖో జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు పీడీ శ్రీనివాసులు తెలిపారు. వర్సిటీ అనుబంధ కళాశాలల విద్యార్థులు (17-25 ఏళ్లు) వారు పాల్గొనవచ్చని వెల్లడించారు. ఇక్కడ ఎంపికైన వారు ఆల్ ఇండియా సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన పేర్కొన్నారు.