TG: వెలుగుమట్లలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదల నిస్సహాయతను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు నీచమైన రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. పేదలకు మేలు జరగకుండా కుట్రలు పన్నుతున్నారని అన్నారు. మాఫియాలుగా ఏర్పడి నిరుపేదల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.