గుడ్లవల్లేరు AANM & VVSR పాలిటెక్నిక్ కళాశాలలో హాస్టల్ డే సందర్భంగా విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. SI ఎన్.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే చట్టాలు, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పోక్సో చట్టం, రోడ్డు భద్రత, బాల్య వివాహాల నిరోధం, మత్తు పదార్థాల వ్యతిరేకత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.