CTR: కుప్పంలో 18-46 ఏళ్ల యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నట్లు కడ కార్యాలయం తెలిపింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 73 రోజుల పాటు శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు అందజేస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కుప్పం ప్రాంతంలో ఏర్పాటు కానున్న 20 పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కడ కార్యాలయం పేర్కొంది.