కర్నూలు: బాల్య వివాహాలు, సైబర్ మోసాలు, మహిళల భద్రతపై పోలీసులు అవగాహన పెంపొందించేందుకు గ్రామాలు, పాఠశాలలు, సమావేశాల ద్వారా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. బుధవారం ర్యాలీల ద్వారా, గ్రామ సభలు, సమావేశాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.