ముక్కు లేదా గొంతులోని పొరల్లో చికాకు కలిగినప్పుడు తుమ్ములు వస్తాయి. దుమ్ము, ధూళి లేదా పొగ వంటి పదార్థాలు ముక్కులోకి చేరినప్పుడు, వాటిని బయటకు పంపడానికి మన శరీరం గాలిని వేగంగా విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే మనకు తుమ్ములు వస్తాయి. సాధారణంగా తుమ్మినప్పుడు మెదడు ఇచ్చే సంకేతాల వల్ల కళ్లు మూసుకుపోతాయి. ఇది మన శరీరం చేసుకునే ఒక సహజ శుభ్రత ప్రక్రియ.