VZM: ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకుని ప్రేమ, పెళ్లి పేరుతో 16 ఏళ్ల బాలికను మోసం చేసిన కేసులో నిందితుడు పంది నారాయణ (24)కు పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.6 వేల జరిమానా విధించింది. అలాగే, బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం మంజూరు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ బుధవారం తెలిపారు.