ఏథర్ ఎనర్జీ తన రిజ్టా S, 450S మోడళ్లపై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఈ నెల 31 వరకు రిజ్టా S ధర రూ.1.05 లక్షలు, 450S ధర రూ.1.13 లక్షలుగా ఉండనుంది. PM ఈ-డ్రైవ్ పథకం ముగియనుండటంతో ఈ ఆఫర్ ఇస్తున్నారు. అదనంగా రూ.6,500 నగదు తగ్గింపు, రూ.10,000 క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్, రూ.3,500 వారంటీ ప్రయోజనాలు పొందవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.