TG: సిద్ధిపేట జిల్లాలో బస్సు–లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, బస్సు డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ప్రజ్ఞాపూర్ రహదారిపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీతో ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు.