AP: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నిర్వహించిన సదస్సులో గ్యాస్ సరఫరాపై చర్చ జరిగింది. గ్యాస్ సరఫరాపై అధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డొమెస్టిక్ గ్యాస్‌కు ఇబ్బంది లేదని వెల్లడించారు. కమర్షియల్ గ్యాస్‌కు ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుకు చంద్రబాబు ఆదేశించారు. అలాగే ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు.